టికెట్‌ ఇవ్వలేదని 300 కుర్చీలను తీసుకెళ్లాడు..

Wed,March 27, 2019 12:51 PM

Congress Lawmaker Takes Away 300 Chairs From Party Office

ముంబై : ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు దక్కించుకోవడానికి ఆయా పార్టీల నాయకులు అనేక కష్టాలు పడుతుంటారు. పార్టీలకు విధేయులుగా ఉంటూ.. ఎన్నికల బరిలో ఉండేందుకు చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. అలాంటి నాయకులకు చివరి నిమిషంలో టికెట్‌ రాకపోతే తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతారు. మహారాష్ట్రలోని సిల్లాడ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అబ్దుల్‌ సత్తార్‌ ఔరంగాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వాలని పార్టీ అగ్ర నాయకత్వాన్ని కోరారు. కానీ ఆయనకు టికెట్‌ ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం నిరాకరించింది. సత్తార్‌ స్థానంలో ఎమ్మెల్సీ సుభాష్‌ జాంబాద్‌కు ఔరంగాబాద్‌ ఎంపీ టికెట్‌ను కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన సత్తార్‌.. తన అనుచరులతో కలిసి పార్టీ ఆఫీసులో ఉన్న 300 కుర్చీలను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా సత్తార్‌ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఆఫీసులో ఉన్న కుర్చీలన్ని తన సొంత డబ్బులతో కొనుగోలు చేశారు. కాంగ్రెస్‌ సమావేశాల కోసం ఈ కుర్చీలను ఉపయోగించారు. తాను ఇప్పుడు పార్టీ నుంచి వెళ్లిపోతున్నా. కనుక తన కుర్చీలను తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా ఉన్నారో వారు.. కుర్చీలను, ఇతర సామాగ్రిని సమకూర్చుకోవాలని సత్తార్‌ సూచించారు.

2437
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles