రాహుల్ వ‌ల్లే.. కాంగ్రెస్‌కు క‌ష్టాలు

Wed,October 9, 2019 12:33 PM

హైద‌రాబాద్‌: రాహుల్ గాంధీ పార్టీని వీడి వెళ్ల‌డం వ‌ల్ల కాంగ్రెస్ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింద‌ని సీనియ‌ర్‌నేత స‌ల్మాన్ కుర్షీద్ అన్నారు. ఈ ఏడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింద‌ని, ఆ ఓట‌మి త‌ర్వాత అవ‌మాన భారంతో రాహుల్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విని వ‌దిలేశార‌ని, దాంతో ఆ పార్టీ ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింద‌న్నారు. రాహుల్ మ‌ధ్య‌లోనే పార్టీని వ‌దిలివెళ్ల‌డం వ‌ల్ల ఆ పార్టీ మ‌రింత ద‌య‌నీయంగా మారింద‌న్నారు. మేం ఎంత వేడుకున్నా.. రాహుల్ మాత్రం అధ్య‌క్ష హోదా నుంచి త‌ప్పుకున్నార‌ని, ఆయ‌న నిర్ణ‌యాన్ని గౌర‌విస్తున్నామ‌న్నారు. పార్టీలో ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూస్తే.. రానున్న హ‌ర్యానా, మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ విజ‌యం సాధించ‌డం అసాధ్య‌మే అని స‌ల్మాన్ కుర్షీద్ తెలిపారు.

1197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles