ఈనెల 28న వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతా..!

Tue,February 19, 2019 12:15 PM

Congress EX MP Killi Kruparani to Join YSRCP

హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను కిల్లి కృపారాణి హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో కలిశారు. జగన్‌తో సమావేశం అనంతరం కృపారాణి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా. ఈనెల 28న అమరావతిలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతా. బీసీ గర్జనలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు చాలా బాగున్నాయి. వైఎస్ జగన్ మాట తప్పరు.. మడమ తిప్పరు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకించాను. పొత్తు వద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశా. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చారు. బీసీలను వాడుకొని చంద్రబాబు వదిలేశారు. ఏపీ ప్రజలు చంద్రబాబు మాటలు విశ్వసించరు. బీసీలు, కుల వృత్తులవారిని చంద్రబాబు మోసం చేశారు. టికెట్ ఆశించి ఇక్కడకు రాలేదు.. బేషరతుగా వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నాన‌ని ఆమె పేర్కొన్నారు.

1231
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles