కాంగ్రెస్ బీజేపీని ఓడించిందంటే నవ్వొస్తున్నది: జవదేకర్

Sat,May 19, 2018 06:46 PM

Congress defeated BJP is laughable says union minister Prakash Javadekar

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఓడించిందన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు వాళ్లు గెలిస్తే ఈవీఎంలు బాగా పని చేస్తున్నాయంటారు.. ఓడిపోతే ఈవీఎంలను టాంపరింగ్ చేశారంటారన్నారు. ఓ గవర్నర్‌కు ఇవ్వాల్సిన మర్యాద ఇదేనా? అని కర్ణాటక గవర్నర్‌పై కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు.

"ఒకచోట ఓడిపోయిన సిద్దరామయ్య మరో చోట స్వల్ప తేడాతో గెలిచారు. కాంగ్రెస్‌కు చెందిన 14 మంది మంత్రులు ఓడిపోయారు. కాంగ్రెస్ హయాంలో నకిలీ ఓటర్ ఐడీ కార్డులు సృష్టించారు. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు పరస్పరం దూషించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఒక్కటయ్యారు. ప్రభుత్వ వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తున్నదంటున్న కాంగ్రెస్సే... న్యాయవ్యవస్థ, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడింది.." అని మంత్రి వ్యాఖ్యానించారు.

5476
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles