'మమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి'

Fri,May 18, 2018 02:31 PM

గోవా: అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతూ గోవా కాంగ్రెస్, బీహార్‌లోని ఆర్జేడీ పార్టీలు ఇవాళ తమ గవర్నర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. కర్ణాటకలో అనుసరించిన విధానాన్నే ఇక్కడా పాటించాల్సిందిగా ఈ సందర్భంగా వారు కోరారు. అవకాశం కల్పిస్తే సభలో మెజార్టీ నిరూపించుకుంటామని గోవా కాంగ్రెస్ నేత యతీశ్ నాయక్ తెలిపారు. ఈ మేరకు గవర్నర్ మృదులా సిన్హాకు మెమోరాండంను ఇచ్చారు. మరోవైపు తేజస్వీ యాదవ్ తన మిత్ర పక్షాల నాయకులతో కలిసి బీహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కలిశారు.


గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవతరించిందని కావునా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. 2017లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-17, బీజేపీ-13, ఎంజీపీ-3 స్థానాల్లో గెలుపొందారు. కాగా ఎమ్మెల్యే ఫిరాయింపుతో ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అత్యధికంగా 80 స్థానాల్లో గెలుపొంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక్కడ జేడీయూతో కూడిన ఎన్డీయే కూటమి అధికారంలో కొనసాగుతుంది.

2104
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles