కాంగ్రెస్, జేడీఎస్‌కు సమయం ఇవ్వని గవర్నర్

Tue,May 15, 2018 04:13 PM

Congress and JDS denied entry to Raj Bhavan as Governor awaits full results

బెంగళూరు: కర్ణాటక అధికార పీఠంపై కన్నేసిన కాంగ్రెస్, జేడీఎస్ గవర్నర్ వాజుభాయ్ వాలాను కలవడానికి వెళ్లాయి. అయితే గవర్నర్ మాత్రం వాళ్లకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో గేటు బయట నుంచే రెండు పార్టీల నేతలు తిరిగి వచ్చేశారు. తుది ఫలితాలు ఇంకా రాకపోవడంతో ఏ పార్టీకీ ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. కర్ణాటకలో 104 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా.. చివరి నిమిషంలో జేడీఎస్‌కు మద్దతివ్వడానికి కాంగ్రెస్ ముందుకు వచ్చి పెద్ద ట్విస్టే ఇచ్చింది. కాంగ్రెస్ 78, జేడీఎస్ 38 స్థానాలు గెలిచాయి. వీళ్లకు ఇద్దరు స్వతంత్రులు కూడా మద్దతిచ్చినట్లు సమాచారం. దీంతో మొత్తం 118 మంది ఎమ్మెల్యేల మద్దతులో ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్, కాంగ్రెస్ సిద్ధమవుతున్నాయి. కుమారస్వామి సీఎంని చేయడానికి కాంగ్రెస్ అంగీకరించింది.


3686
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles