సర్జికల్ వీడియోతో బీజేపీ రాజకీయం..

Thu,June 28, 2018 12:05 PM

Congress accuses BJP of taking political gains from surgical strike

న్యూఢిల్లీ: సర్జికల్ దాడికి సంబంధించిన వీడియో రిలీజ్ కావడం పట్ల బీజేపీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. భారత ఆర్మీకి చెందిన ఫూటేజ్‌ను రాజకీయ ప్రయోజనం కోసం రిలీజ్ చేశారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సర్జికల్ దాడులను బీజేపీ సిగ్గులేకుండా వాడుకుందన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ప్రధాని మోదీ దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సర్జికల్ దాడులను అడ్డుపెట్టుకుని ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఓట్ల కోసం ఆర్మీ సాహాసాన్ని త్యాగం చేయడం దారుణమన్నారు. దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోదీ ప్రభుత్వం విఫలమైనా, అమిత్ షా ఓడిపోతున్నా, అప్పుడు రాజకీయ లబ్ధి కోసం భారత ఆర్మీ ధైర్యసాహాసాలను బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. కశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నిలువరించేందుకు మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. యూపీఏ హయాంలోనూ సర్జికల్ దాడులు జరిగాయని, కానీ ఆ పార్టీ ఎప్పుడు వాటిని వాడుకోలేదని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

897
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles