పెళ్లికి ముందు నో ఫొటోషూట్

Tue,December 10, 2019 04:15 PM


పెళ్లి వేడుక అంటే ఫొటోల సందడి ఉంటుందనే విషయం తెలిసిందే. నిశ్చితార్థం నుంచి పెళ్లి వేడుక పూర్తయే వరకు ప్రతీ సన్నివేశాన్ని అన్ని కెమెరాల్లో బంధిస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో కొత్తగా పెళ్లి చేసుకునే యువతీయువకులకు ఈ అవకాశం లేకుండాపోయింది. జైనులు, గుజరాతీ, సింధీ కమ్యూనిటీకి చెందిన వారు ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చేయవద్దని ఆదేశాలు జారీఅయ్యాయి. ఆయా కమ్యూనిటీకి చెందిన పంచాయతీ పెద్దలు ఈ ఆదేశాలు (దిక్తత్) జారీచేశారు.


జైన్ కమ్యూనిటీకి చెందిన వెడ్డింగ్ వేడుకల్లో పురుష కొరియోగ్రాఫర్లు రావడంపై కూడా నిషేధం విధించారు. పెళ్లికి ముందు మహిళలు పాల్గొనే సంగీత్ సెర్మనీలో ఫొటోషూట్ చేయడం, వీడియోలు తీయడం, పురుష కొరియోగ్రాఫర్లు పాల్గొనడంపై నిషేధం విధించినట్లు భోపాల్ గుజరాత్ కమ్యూనిటీ జాతీయ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. సింధీ కమ్యూనిటీ పెద్దలు కూడా ఇలాంటి ఆదేశాలనే జారీచేశారు.

4017
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles