రోడ్డుపై మ్యాగజైన్స్, పుస్తకాలు చదువుతూ నిరసన

Fri,January 12, 2018 01:38 PM

College students sat to study on the road outside at library in Dharamshala


హిమాచల్‌ప్రదేశ్: ప్రధానమంత్రి స్వచ్ఛ భారతం దిశగా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కొన్ని ప్రభుత్వ సంస్థల్లో ఇప్పటికీ టాయ్‌లెట్లు లేకపోవడం గమనార్హం. తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లో విద్యార్థులు స్థానికంగా ఉండే గ్రంథాలయంలో కనీస సౌకర్యాలైన సీట్ల ఏర్పాటు, టాయిలెట్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్డు బాట పడ్డారు. విద్యార్థులంతా కలిసి ధరమ్‌శాలాలోని ఓ ప్రధాన వీధిలో రోడ్డుపై కూర్చొని మ్యాగజైన్స్, పుస్తకాలు, న్యూస్ పేపర్లు చదువుతూ తమ నిరసన తెలియజేశారు. గ్రంథాలయంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో విద్యార్థులంతా కలిసి వినూత్నంగా నిరసన చేపట్టారు.

1177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles