పోలింగ్ బూత్‌లో కోబ్రా హల్‌చల్.. ఆగిపోయిన పోలింగ్.. వీడియో

Mon,May 14, 2018 02:46 PM

Cobra Halts Voting For 20 Minutes At Bengaluru Polling Booth

బెంగళూరు: మే 12 న‌ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 224 స్థానాల్లో 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మే 15న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే.. పోలింగ్ రోజున ఓ విచిత్ర ఘటన చోటు చేసుకున్నది.

బెంగళూరులోని మహదేవపుర పోలింగ్ బూత్‌లో ఈ సంఘటన చోటు చేసుకున్నది. అందరూ ఓటు వేయడానికి లైన్‌లో నిల్చున్నారు. ఇంతలో ఓ పాము తిన్నగా పోలింగ్ బూత్‌లో జొర్రబడింది. దీంతో ఓటు వేయడానికి వచ్చిన వాళ్లంతా భయపడ్డారు. బెదిరిపోయారు. దీంతో పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు కష్టపడి మరీ.. దాన్ని పోలింగ్ బూత్ నుంచి బయటికి వెళ్లగొట్టారు. ఓ సెక్యూరిటీ గార్డ్ తన దగ్గర ఉన్న కట్టెతో దాన్ని బయటికి పంపించాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మళ్లీ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. ఈ ఘటనను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

3786
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles