ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఆధీనంలో పాక్ బోటు

Tue,May 21, 2019 05:34 PM

Coast Guard apprehends Pakistani Fishing Boat with 100 Kgs of Heroin

గుజరాత్: పాకిస్థాన్‌కు చెందిన ఓ బోటును భారత తీర రక్షక దళం తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇంటలిజెన్స్ అదేవిధంగా డీఆర్‌ఐ అధికారులు ఇచ్చిన సమాచారంతో గుజరాత్ కోస్ట్ గార్డ్స్ ఇండో-పాక్ అంతర్జాతీయ సముద్ర జలాల తీర సరిహద్దులో రైడ్ చేశారు. అనుమానిత బోట్ కదలికలను గుర్తించారు. పాకిస్థాన్‌కు చెందిన చేపలు పట్టే ఆ బోటు ఆరుగురు సిబ్బందితో ఉంది. సదరు బోటు ఎప్పుడైతే భారత్ జలాల్లోకి ప్రవేశించిందో అధికారులు వెంటనే బోటును నిలువరించి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 100 కేజీల హెరాయిన్‌ను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని బోటును స్వాధీనం చేసుకున్నారు.

2341
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles