హాస్ప‌ట‌ళ్ల‌కు ప్ర‌త్యేక భ‌ద్ర‌త : సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

Mon,June 17, 2019 05:06 PM

CM Mamata Banerjee suggests extra security at hospitals, meets protesting doctors

హైద‌రాబాద్: బెంగాల్‌లో నిర‌స‌న చేప‌డుతున్న డాక్ట‌ర్ల‌తో ఇవాళ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స‌మావేశం అయ్యారు. సెక్ర‌టేరియేట్‌లో ఆమె డాక్ట‌ర్ల బృందాన్ని క‌లుసుకున్నారు. స‌మావేశాన్ని లైవ్ ఇవ్వాల‌న్న డిమాండ్‌కు దీదీ అంగీక‌రించినా.. ఏ ఛాన‌ల్ కూడా ఆ మీటింగ్‌ను క‌వ‌ర్ చేయ‌లేదు. స్థానిక ఛాన‌ల్ మాత్రం ఆ స‌మావేశాన్ని క‌వ‌ర్ చేసేందుకు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వంపై పూర్తి నమ్మ‌కం ఉంద‌ని డాక్ట‌ర్ల బృందం పేర్కొన్న‌ది. ఎమ‌ర్జెన్సీ వార్డులో పేషెంట్‌కు చెందిన ఇద్ద‌రు సంబంధీకుల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని దీదీ డాక్ట‌ర్ల‌కు సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఎమ‌ర్జెన్సీ డిపార్ట్‌మెంట్ల వ‌ద్ద కొత్త త‌ర‌హా బందోబ‌స్తును ఏర్పాటు చేయాల‌న్నారు. జిల్లా స్థాయి ఆస్ప‌త్రుల్లో పీఆర్వోలు ఉంటార‌న్నారు. డాక్ట‌ర్ల‌పై త‌ప్పుడు కేసులు న‌మోదు చేయ‌రాదు అని దీదీ అన్నారు. ఇవాళ స‌మావేశంలో 31 మంది డాక్ట‌ర్లు పాల్గొన్నారు. ఆ రాష్ట్ర హెల్త్ సెక్ర‌ట‌రీ చంద్రిమా భ‌ట్టాచార్య కూడా స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. డ్యూటీ డాక్ట‌ర్‌పై దాడి జ‌రిగిన కేసులో అయిదుగుర్ని అరెస్టు చేసిన‌ట్లు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వెల్ల‌డించారు. రాత్రి పూట హాస్ప‌ట‌ళ్ల వ‌ద్ద సెక్యూర్టీని పెంచ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు.

689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles