మోదీ ఓ సైతాన్, అమిత్ షా ఓ గూండా : మమత

Thu,May 16, 2019 04:22 PM

CM mamata banerjee fire on PM Modi and Amit Shah

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. మోదీ ఓ సైతాన్, అమిత్ షా ఓ గూండా అని ఆమె దుయ్యబట్టారు. బెంగాల్ గౌరవాన్ని బీజేపీ దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. గడిచిన ఐదేళ్ల కాలంలో అయోధ్యలో రామాలయం నిర్మించలేని బీజేపీ ప్రభుత్వం.. విద్యాసాగర్ విగ్రహాన్ని నిర్మిస్తుందా? అని ప్రశ్నించారు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చి బెంగాల్ మర్యాదను కాషాయం పార్టీ దెబ్బ తీసింది. ఓటు వేసేటప్పుడు ఓటర్లు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. బీజేపీ ముందు బెంగాల్ మోకరిల్లదు. ఒక్క బెంగాలీ కూడా బీజేపీకి ఓటు వేయరు. బీజేపీ హయాంలో 12 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశ సమగ్రతను బీజేపీ దెబ్బతీస్తోంది. తనను ఎవరూ భయపెట్టలేరని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

1054
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles