కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

Mon,June 17, 2019 03:21 PM

CM KCR visits Vijayawada Kanakadurga temple

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విజయవాడలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా అక్కడి కనకదుర్గ అమ్మవారిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్‌ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్‌కు ఆలయ అర్చకులు ఆశీర్వాదం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వచ్చే ముందు సీఎం కేసీఆర్‌కు గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్‌.. జగన్‌ నివాసానికి బయల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్‌ వెంట టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌ ఉన్నారు.


1918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles