కరుణానిధికి కేసీఆర్‌ నివాళి

Wed,August 8, 2018 03:01 PM

CM KCR Pays Tribute To Karunanidhi

చెన్నై: రాజాజీ హాల్‌లో పోరాట యోధుడు, ద్రవిడ ఉద్యమ సారథి, డీఎంకే అధ్యక్షుడు ముత్తువేల్ కరుణానిధి(94) భౌతికకాయానికి తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. సీఎం వెంట ఎంపీ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. కరుణానిధి భౌతికకాయం వద్ద స్టాలిన్, కనిమొళి కుటుంబసభ్యులను కేసీఆర్‌ పరామర్శించారు. అంత‌కుముందు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం కేసీఆర్ చెన్నై చేరుకున్నారు. రాజాజీ హాల్ నుంచి సాయంత్ర 4 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభంకానుంది. సాయంత్రం 6 గంటలకు కరుణ అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.


3749
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles