తండ్రి అసెంబ్లీకి.. కుమారుడు ఎంపీ స్థానానికి..

Tue,April 9, 2019 01:13 PM

CM Kamal Nath files his nomination for by election to the Chhindwara assembly

భోపాల్‌ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కమల్‌నాథ్‌(73) మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గతేడాది డిసెంబర్‌లో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. నాడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌నాథ్‌ పోటీ చేయలేదు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా కొనసాగుతున్న కమల్‌నాథ్‌ సీఎంగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలి. చింద్వారా ఎమ్మెల్యే సక్సేనా ఇటీవలే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో చింద్వారా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కమల్‌నాథ్‌ పోటీ చేస్తున్నారు. ఇక కమల్‌నాథ్‌ కుమారుడు నాకుల్‌ నాథ్‌(44) లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈయన కూడా చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. దీంతో తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఇవాళ నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు.2614
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles