అసెంబ్లీలో చంద్ర‌బాబుకు జ‌గ‌న్ వార్నింగ్‌.. వీడియో

Fri,July 12, 2019 11:28 AM

CM Jagan warns Chandrababu Naidu over TDP members shouting in AP Assembly

హైద‌రాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో ఇవాళ ర‌భ‌స చోటుచేసుకున్న‌ది. రైతు రుణాల‌పై సీఎం జ‌గ‌న్ త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని.. దానిపై టీడీపీ పార్టీ స‌భ‌లో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చింది. సీఎం జ‌గ‌న్ రాజీనామా చేస్తారా అని చంద్రబాబు స‌వాల్ చేశారు. అయితే సీఎం జ‌గ‌న్ మాట్లాడుతున్న స‌మ‌యంలో.. టీడీపీ స‌భ్యులు ప్ర‌సంగాన్ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. నోటీసుకు రిప్లై ఇస్తూ.. టీడీపీ స‌భ్య‌లపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మా స‌భ్యులు లేస్తే.. టీడీపీ స‌భ్యులు ఎవ‌రూ త‌మ స్థానాల్లో కూర్చోలేర‌న్నారు. మ‌ర్యాద లేదు, గౌర‌వం లేదన్నారు. చంద్ర‌బాబు మాట్లాడిన‌ప్పుడు మేమేమైనా మాట్లాడామా అన్నారు. బుద్ధి, జ్ఞానం ఉండాలి, మీరెలా ఎమ్మెల్యేలు అయ్యార‌ని జ‌గ‌న్ ఆగ్ర‌హించారు. మీరేమైనా పెద్ద‌గా క‌ళ్లు చేసి చూస్తూ ఎవ‌రైనా భ‌య‌ప‌డుతారా అని చంద్ర‌బాబును ఉద్దేశిస్తూ జ‌గ‌న్ తీవ్ర ఆవేశానికి లోన‌య్యారు. ఎమ్మెల్యే అచ్చంనాయుడును ఉద్దేశిస్తూ ప‌ర్స‌నాల్టీ పెర‌గ‌డం కాదు, బుద్ధి పెర‌గాలంటూ జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారు.2996
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles