బోటు అంచున మహారాష్ట్ర సీఎం సతీమణి సెల్ఫీ.. వివాదంతో సారీ

Mon,October 22, 2018 03:50 PM

cm fadnavis wife says sorry for boat selfie

గొప్పోళ్ల సిత్రాలు గిట్లనే ఉంటయి. ఆమె మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య. పేరు అమృత. ఏదో నౌకావిహారానికని వెళ్లారు. వెనకాల మందీమార్బలం ఉన్నారు. బోటుపై కూర్చున్న అమృతకు సెల్ఫీ కోరిక పుట్టింది. అది ఎక్కడో కాదు. బోటు అంచున అత్యంత ప్రమాదకరమైన రీతిలో కూర్చుని ఆమె సెల్ఫీ తీసుకోవాలనుకున్నారు. కానీ భద్రతా సిబ్బంది వారించారు. అయినా లెక్కచేయకుండా ఆమె అలా వెళ్లి అంచుమీద కూర్చుని సెల్ఫీ తీసుకోవడం మొదలుపెట్టారు. భద్రతా సిబ్బందికి పైప్రాణాలు పైనే పోయాయి. అలా బోటు కొసనుంచి పొరపాటున నీళ్లలోకి జారిపడితే ఇంకేమైనా ఉందా? ఈ వ్యవహారం సోషల్ మీడియాలో సహజంగానే వైరల్ అయింది. సామాన్యులు సెల్ఫీ సరదాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం రోజూ చూస్తూనే ఉన్నాం. కానీ ప్రముఖులు ఇలాంటి పనులు చేయడం ఏమీ బాగాలేదని చాలామంది నెటిజనులు పెదవి విరిచారు. దాంతో ఆమె ఈ వివాదానికి తెరదించుతూ జరిగిందానికి క్షమాపణలు చెప్పారు.

2405
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles