ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఎం ఫడ్నవిస్

Fri,March 15, 2019 11:46 AM

CM Fadnavis Visits Footover Bridge Accident spot


ముంబై : ముంబైలోని సీఎస్ఎంటీ రైల్వేస్టేషన్ కు సమీపంలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిన ప్రాంతాన్ని ఇవాళ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పరిశీలించారు. అనంతరం ఈ ఘటనలో గాయపడిన వారిని సీఎం ఫడ్నవిస్ కలిశారు. ఆస్పత్రిలో చికిత్పపొందుతున్న బాధితులను పరామర్శించి..వారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్లర్లను అడిగి తెలుసుకున్నారు. గాయాలైన వారిలో 10 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా..వారిలో ఒకరు ఐసీయూలో ఉన్నారని ఫడ్నవిస్ తెలిపారు. మెరుగైన వైద్యం అందించామని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. బ్రిడ్జి కూలిన ఘటనపై అత్యున్నతస్థాయి విచారణకు ఆదేశించామన్నారు.

ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా..30 మందికిపైగా గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే రూ.5లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.

971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles