రిలీఫ్ ఫండ్ కు సీఎం ఫడ్నవిస్, మంత్రుల నెల జీతం విరాళం

Tue,August 13, 2019 04:33 PM

CM Fadnavis, Ministers to donate their one month salary TO CM Relief Fund


మహారాష్ట్ర : మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైన విషయం తెలిసిందే. వరదల్లో నిరాశ్రయులైన ప్రజలను ఆదుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగిస్తోంది. బాధితుల సహాయార్థం మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవిస్, మంత్రులు తమ నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

మహారాష్ట్రలోని కొల్హాపూర్, సాంగ్లి జిల్లాలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. వరద ముంపుతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 40కి చేరింది. గత వారం సాంగ్లి జిల్లాలో పడవ మునిగిపోయి ఐదుగురు మృతి చెందగా..రెస్క్యూ టీం మృతదేహాలను వెలికితీసింది. వీటితోపాటు వివిధ ప్రాంతాల్లో వరదలతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం ఇప్పటివరకు 4,14000 మందిని పునరావాస శిబిరాలకు తరలించింది.

593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles