30న నేనొక్కడినే ప్రమాణ స్వీకారం చేస్తా..

Sun,May 26, 2019 03:37 PM

  CM designate Jagan Mohan Reddy press meet

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో జగన్‌ మాట్లాడుతూ.. పొరుగు రాష్ర్టాలతో సత్సంబంధాలు ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రత్యేక హోదాకు కేసీఆర్‌ మద్దతు ఇచ్చారు. రాష్ర్టానికి అందాల్సిన సహాయం ఆలస్యమైంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను కూడా మర్యాదపూర్వకంగా కలిశాను. ప్రజలకు చెప్పినవన్నీ అమలు చేస్తాం. ఐదేళ్లలో ఏపీలో జరిగిన కుంభకోణాలు అందరికీ తెలుసు. రాజధానిలో బినామీలతో తక్కువ ధరకు భూములు కొనిపించారు. ల్యాండ్‌ పూలింగ్‌లో బినామీలను వదిలేసి రైతుల భూములు తీసుకున్నారు. రాజధాని భూముల్లో అతిపెద్ద కుంభకోణం జరిగింది. నచ్చినవారికి తక్కువ ధరకు భూములు అమ్మేశారని జగన్‌ ఆరోపించారు.


మా ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుందని జగన్‌ చెప్పారు. అవినీతిరహిత పాలన అందిస్తాం. అవినీతి జరిగిందని తెలిస్తే కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తాం. చంద్రబాబు, కాంగ్రెస్‌ కలిసి నాపై కేసులు వేశాయి. మా నాన్న సీఎంగా ఉన్నప్పుడు నేను సచివాలయంలో అడుగుపెట్టలేదు. పోలవరంలో కుంభకోణం జరిగితే విచారణ చేపడుతాం. 30న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తా. మరో వారం, పదిరోజుల్లో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తా. ప్రమాణస్వీకారం తర్వాత శాఖలవారీగా సమీక్ష చేస్తా. ఎన్డీఏ మెజార్టీ 250 దగ్గరే ఆగిపోతే బాగుండేది. ప్రత్యేక హోదాపై సంతకం పెట్టించుకుని మద్దతిచ్చేవాళ్లమని జగన్‌ వ్యాఖ్యానించారు.

6199
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles