హోటల్‌లో అగ్నిప్రమాదం దురదృష్టకరం : సీఎం కేజ్రీవాల్‌

Tue,February 12, 2019 01:01 PM

CM Arvind Kejriwal on 17 dead in the fire that broke out in Hotel Arpit Palace

న్యూఢిల్లీ : ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని హోటల్‌ అర్పిత్‌ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం సంభవించడం దురదృష్టకరమని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. అగ్నిప్రమాదంలో 17 మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఓ మహిళ, పసిపాప ఉన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు సీఎం కేజ్రీవాల్‌. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ అగ్నిప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ.

ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు హోటల్‌లో మంటలు చెలరేగాయి. హోటల్‌లో ఉన్న 65 గదుల్లో 150 మంది నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగడంతో.. కొందరు మేల్కొని కిటికీల్లో నుంచి బయటకు దూకారు. మరో ఇద్దరు టెర్రస్‌ పైనుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. షార్ట్‌ సర్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు. 12 ఫైరింజన్లు మంటలను అదుపు చేశాయి.


2330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles