సిద్ధూ భార్యకు క్లీన్‌చిట్

Thu,December 6, 2018 11:08 PM

Clean Chit to Navjot Singh Sidhu Wife in Amritsar Train Accident Investigation

చండీగఢ్ : దసరా వేడుకల సందర్భంగా అమృత్‌సర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్‌కు క్లీన్‌చిట్ లభించింది. అక్టోబర్ 19న ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సిద్ధూ కుటుంబానికి సన్నిహితుడైన స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ కుమారుడు సౌరభ్ మిథు మదన్ దసరా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నవ్‌జ్యోత్ కౌర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. రావణ దహనం సందర్భంగా ప్రజలు పెద్దసంఖ్యలో పట్టాలపైకి చేరుకోవడం, ఇదే సమయంలో అకస్మాత్తుగా రైలు దూసుకురావడంతో 60 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ దారుణంపై పంజాబ్ సర్కారు బీ పురుషార్థ నేతృత్వంలో మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. తాజాగా కమిటీ 300 పేజీల నివేదికను రాష్ట్ర హోంశాఖకు అందజేసింది. నిర్వాహకుడు సౌరభ్, వేడుకలకు అనుమతించిన స్థానిక మున్సిపల్ యంత్రాంగం, అధికారులు, పట్టాలపై ప్రజలు పెద్దసంఖ్యలో ఉన్న విషయాన్ని గమనించకుండా రైలుకు అనుమతించిన రైల్వే అధికారులను నివేదిక తప్పుపట్టింది. ఈ ప్రమాదంలో నవ్‌జ్యోత్ కౌర్‌కు మాత్రం క్లీన్‌చిట్ ఇచ్చింది. తదుపరి చర్యలపై ఈ నివేదికను ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌కు హోంశాఖ అందజేయనున్నది.

1138
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles