రెండో తరగతి పిల్లాడిపై ట్యూటర్ ప్రతాపం..

Mon,November 19, 2018 11:58 AM

Class 2 Boy Punched Repeatedly By Tutor in Uttar Pradesh

ఈ జనరేషన్ వేరు. తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా వేరు. పిల్లలను ఎన్ని ఎక్కువ డబ్బులు పెటి చదివిస్తే.. ఎన్ని ట్యూషన్లు పెట్టి చదివిస్తే.. కార్పొరేట్ స్కూల్‌లో చదివిస్తే.. బాగా చ‌దువుతారు అనుకుంటారు. ఇలా అన్ని హైరేంజ్‌లో ఉండాలనుకుంటారు కానీ.. ఆ పిల్లలు ఎలా చదువుతున్నారు.. స్కూల్, ట్యూషన్‌లో పిల్లలను వాళ్లు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనే విషయం మాత్రం పట్టించుకోరు. లక్షలకు లక్షలు పోసి చదివించమంటే ముందుండే పేరెంట్స్.. ఆ పిల్లాడి బాగోగులు మాత్రం పట్టించుకోరు. అందుకే దీన్ని కలికాలం అంటున్నాం. అందుకే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని అలిగఢ్‌లో రెండో తరగతి పిల్లాడిపై తన ప్రతాపం చూపించాడు ట్యూటర్. నవంబర్ 15న ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డవడంతో అసలు విషయం తెలిసింది. పిల్లాడి ఒంటి మీద ఉన్న గాయాలను చూసిన పేరెంట్స్ ఏం జరిగిందని అడగగా.. ఆ పిల్లాడు ట్యూషన్ మాస్టర్ కొట్టిన సంగతి తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో ట్యూషన్ సెంటర్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో ట్యూటర్ పిల్లాడిని కొడుతున్న దృశ్యాలు కనిపించాయి. పిల్లాడిని చైర్‌లో కూర్చోబెట్టి.. తన షూతో పిల్లాడిని బాదాడు. పిల్లాడి వేళ్ల మీద కొట్టాడు. పిల్లాడి వెంట్రుకలను పట్టుకొని వెనుక రెండు మూడు సార్లు బాదాడు. తర్వాత పిల్లాడితో వాటర్ తాగించి పక్కన కూర్చోబెట్టుకొని నవ్వు అంటూ బెదిరించాడు. వీడియోను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పరారిలో ఉన్న ట్యూటర్ కోసం గాలిస్తున్నారు.

1780
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles