అమ్మాయితో మాట్లాడాడని చంపేశారు..

Fri,September 7, 2018 02:56 PM

Class 11 Boy Beaten To Death For Talking To Girl In Uttar Pradesh

కాన్పూర్ : నువ్వు నా అమ్మాయితోనే మాట్లాడుతావా! నా లవర్‌తో మాట్లాడొద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా.. పట్టించుకోవా! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ యువకుడు మరో యువకుడిని కొట్టి చంపాడు. ఈ దారుణ సంఘటన కాన్పూర్‌లోని కిడ్వాయి నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.

కిడ్వాయి నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువతిని యువకుడు ప్రేమిస్తున్నాడు. అయితే ఈ యువతితో అదే ప్రాంతానికి చెందిన మరో 16 ఏళ్ల యువకుడు నిత్యం మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రియుడు.. తన లవర్‌తో తరుచుగా మాట్లాడితే బాగుండదు చూడు అని హెచ్చరించాడు. బుధవారం సాయంత్రం తన ప్రియురాలితో 16 ఏళ్ల యువకుడు మాట్లాడుతుండగా.. తన స్నేహితులతో కలిసి అతడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని లాల లజపతి రాయ్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

6158
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles