ఆర్ఎస్ఎస్ శాఖా నిర్వహిస్తుండగా ఘర్షణ..వీడియో

Fri,July 12, 2019 05:30 PM

Clash between two groups during an rss shakha session


రాజస్థాన్‌లోని బుండీ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బుండీలోని ఓ పార్కులో కొంతమంది ఆడుకుంటున్నారు. అయితే అదే సమయంలో పార్కులో శాఖా నిర్వహించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ (రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌) కార్యకర్తలు వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కొంతమంది కలిసి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలపై దాడి చేయగా..ఆర్ఎస్ఎస్ వాళ్లు కూడా ప్రతిఘటించారు.

ఈ ఘటన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. మరోవైపు ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే మదన్‌ దిలావర్‌ అసెంబ్లీలో కూడా లేవనెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు శాఖా నిర్వహించుకునేందుకు వస్తే ఇలా దాడులు చేయడం సరికాదని, భవిష్యత్‌ లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
1474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles