ఆ తీరుతో ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌కు ప్ర‌మాదం : రాజ్‌నాథ్‌

Mon,February 4, 2019 12:49 PM

clash between enforcement agencies is dangerous to federal structure, says Rajnath Singh

న్యూఢిల్లీ: కోల్‌క‌తాలో సీబీఐ అధికారుల‌ను పోలీసులు అరెస్టు చేసిన అంశంపై ఇవాళ లోక్‌స‌భ‌లో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. భ‌ద్ర‌తా సంస్థ‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌.. భార‌తీయ ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌కు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అన్నారు. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ను త‌న ప‌ని తాను చేసుకునే వీలు క‌ల్పించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కోరుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. కోల్‌క‌తాలో జ‌రిగింది అసాధార‌ణ విష‌య‌మ‌ని, ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ నుంచి నివేదిక కోరామ‌ని రాజ్‌నాథ్ వెల్ల‌డించారు. రాష్ట్ర చీఫ్ సెక్ర‌ట‌రీ, డీజీపీల‌కు గ‌వ‌ర్న‌ర్ కేశ‌రినాథ్ త్రిపాఠి స‌మ‌న్లు జారీ చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. సీబీఐ, బెంగాల్ పోలీసుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని వారికి ఆదేశించిన‌ట్లు చెప్పారు. అయితే టీఎంసీ నేత‌లు ఆందోళ‌న చేయ‌డంతో స‌భ‌ను 2 గంట‌ల‌కు వాయిదా వేశారు. శార‌దా చిట్‌ఫండ్ స్కామ్‌లో ఆదివారం సీబీఐ అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. దానిలో భాగంగా వాళ్లు కోల్‌క‌తా పోలీసు క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు వెళ్లారు. అప్పుడు సీబీఐ అధికారుల‌ను బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేప‌థ్యంలో సీఎం మ‌మ‌తా .. పోలీసు చీఫ్‌కు అండ‌గా నిలిచారు. దీంతో అక్క‌డ హై డ్రామా సాగింది. కోల్‌క‌తా పోలీసుల‌పై సీబీఐ వేసిన పిటిష‌న్‌ను రేపు సుప్రీంకోర్టు విచారించ‌నున్న‌ది. రాజీవ్‌ను విచారించేందుకు ప్రూఫ్ కావాల‌ని సుప్రీం అడిగింది. బెంగాల్‌లో రాజ్యాంగ వ్య‌వ‌స్థ కుప్ప‌కూలింద‌ని కేంద్ర మంత్రి జ‌వ‌దేక‌ర్ ఆరోపించారు. సీఎం స్వ‌యంగా ధ‌ర్నా చేప‌ట్ట‌డం దారుణ‌మ‌న్నారు. మ‌హాకూట‌మి ప్రాంతీయంగా వేరుగా ఉన్నా, అవినీతిలో మాత్రం ఒక్క‌టేన‌న్నారు.

895
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles