లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌.. విచార‌ణ‌కు హాజ‌రైన చీఫ్ జ‌స్టిస్‌

Thu,May 2, 2019 12:44 PM

CJI Ranjan Gagoi appears before panel probing sexual harassment charge

హైద‌రాబాద్‌: మాజీ ఉద్యోగి నుంచి లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్ ఇవాళ జ‌స్టిస్ ఎస్ఏ బాబ్డే విచార‌ణ క‌మిటీ ముందు హాజ‌ర‌య్యారు. ప్యాన‌ల్ చేసిన అభ్య‌ర్థ‌న‌కు స్పందించిన గ‌గోయ్‌.. ఇవాళ క‌మిటీ ముందు వ్య‌క్తిగ‌తంగా హాజ‌ర‌య్యారు. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు న్యాయ‌వాదులు సీజేకు నోటీసులు జారీ చేయ‌లేదు. విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ వారు కేవ‌లం అభ్య‌ర్థ‌న లేఖ‌ను మాత్రం సీజేకు రాశారు. సీజేను విచారించిన క‌మిటీలో జ‌స్టిస్ ఇందిరా బెన‌ర్జీ, ఇందూ మ‌ల్హోత్రాలు కూడా స‌భ్యులుగా ఉన్నారు. జ‌స్టిస్ బాబ్డే మాత్రం ఆ క‌మిటీకి చీఫ్‌గా ఉన్నారు. గ‌గోయ్‌పై ఫిర్యాదు చేసిన మాజీ ఉద్యోగి విచార‌ణ‌లో పాల్గొనేందుకు లాయ‌ర్ కావాల‌ని అడిగింది. కానీ క‌మిటీ దానికి అంగీక‌రించ‌లేదు. చీఫ్ జ‌స్టిస్ గ‌గోయ్ త‌న‌ను లైంగికంగా వేధించార‌ని రెండు వారాల క్రితం ఓ మాజీ ఉద్యోగిని ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌పై కొన్ని వెబ్‌సైట్లు వార్త‌లు రాశాయి. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసేందుకు త‌న‌పై కుట్ర జ‌రిగింద‌ని సీజేఐ ఆరోపించారు.

1316
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles