ట్రిపుల్ త‌లాక్‌, పౌర‌స‌త్వ బిల్లు.. ప‌నికి రాకుండాపోయాయి..

Wed,February 13, 2019 01:13 PM

న్యూఢిల్లీ: రాజ్య‌స‌భ‌ స‌మావేశాలు ముగిశాయి. దీంతో ట్రిపుల్ త‌లాక్‌, పౌర‌స‌త్వ బిల్లులు ప‌నికి రాకుండాపోయాయి. ఈ రెండు బిల్లులకు.. రాజ్య‌స‌భ‌లో ఆమోదం ద‌క్క‌లేదు. వివాదాస్ప‌ద‌మైన ఈ రెండు బిల్లులు లోక్‌స‌భలో గ‌ట్టెక్కాయి. కానీ వాటిపై రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌గ‌లేదు. లోక్‌స‌భ‌లో బిల్లులు పాసైన త‌ర్వాత వాటిని రాజ్య‌స‌భ‌కు పంపారు. అయితే త్వ‌ర‌లో లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో కొత్త స‌భ కొలువుతీరుతుంది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు బిల్లులు మ‌ళ్లీ లోక్‌స‌భ‌లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. రాఫేల్ అంశం ఉభ‌య‌స‌భ‌లను స్తంభింప‌చేసింది. పౌర‌స‌త్వ బిల్లుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని రాజ్య‌స‌భ భావించినా.. విప‌క్షాల నినాదాల‌తో స‌భ‌ను వాయిదా వేయాల్సి వ‌చ్చింది. బ‌డ్జెట్ స‌మావేశాల కోసం జ‌న‌వ‌రి 31వ తేదీన ఉభ‌య‌స‌భ‌లు స‌మావేశం అయ్యాయి. ఫిబ్ర‌వ‌రి ఒక‌ట‌వ తేదీన మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. అయితే ఇవాళ మూజువాణి ఓటుతో తాత్కాలిక బ‌డ్జెట్‌కు రాజ్య‌స‌భ‌లో ఆమోదం ద‌క్కింది. ఆ త‌ర్వాత స‌భ‌ను నిర‌వ‌ధికంగా వాయిదావేశారు.

1454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles