పవర్ బ్యాంక్‌లో బంగారం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

Thu,February 1, 2018 06:15 PM

CISF nabbed a passenger carrying gold bars concealed in power bank at mumbai airport

ముంబై: ఇదివరకు షూ సాక్స్, అండర్‌వేర్, ఇంకా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని బంగారాన్ని విదేశాల నుంచి స్వదేశాలకు తరలించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. టెక్నాలజీ అప్‌డేట్ అయింది. అందుకే ఓ వ్యక్తి పవర్ బ్యాంక్‌లో గోల్డ్ బార్స్‌ను పెట్టి అక్రమంగా తరలిస్తూ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్‌ఎఫ్ సిబ్బందికి అడ్డంగా దొరికిపోయాడు. 600 గ్రాముల బంగారం బార్లను పవర్ బ్యాంకులో తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకొని అతడిని కస్టమ్ అధికారులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు 18 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

2101
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles