నారా లోకేశ్‌పై పోటీ చేస్తున్న త‌మ‌న్నా

Mon,March 25, 2019 03:25 PM

Cine Artist Tamanna Simhadri Nomination As MLA in Mangalagiri Against Nara Lokesh

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఓ ట్రాన్స్‌జెండర్ పోటీ చేయాల‌ని ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి అన్నారు. ఏపీ ఎన్నికల్లో మంగళగరి నుంచి తమన్నా బరిలోకి దిగారు. మంగళగిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం స్వతంత్ర అభ్యర్థిగా స్థానిక ఎంఆర్వో కార్యాల‌యంలో త‌మ‌న్నా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేష‌న్ దాఖ‌లు చేసిన త‌ర్వాత ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొద‌టిసారి థర్డ్ జెండర్‌గా ప్రజా సేవ చేసేందుకు ముందుకు వస్తున్నానని తన‌ను నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆశీర్వదించాలని కోరారు. జనసేన పార్టీకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ పార్టీ నాకు సరైన గుర్తింపు ఇవ్వలేదని తెలిపారు.

ఇప్ప‌టి నుంచి మంగళగిరిలోనే అంద‌రికీ అందుబాటులో ఉంటానని ప్ర‌జాసేవ చేస్తాన‌ని చెప్పారు. టీడీపీ నుంచి మంగ‌ళ‌గిరి నుంచి పోటీచేస్తున్న మంత్రి నారా లోకేశ్‌కు తమన్నా సవాల్ విసిరారు. లోకేశ్‌కు దమ్ముంటే ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి... అప్పుడు ఎమ్మెల్యేగా పోటీకి బ‌రిలో దిగాల‌ని సవాల్ విసిరారు. ఓటమి భయం వల్లే లోకేశ్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంలేద‌ని విమర్శించారు.

6946
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles