గర్ల్ ఫ్రెండ్ కోసం నకిలీ టికెట్ తో ఎయిర్ పోర్టుకు..

Wed,June 19, 2019 06:10 PM

Chinese youth held at Chennai airport with fake ticket


చెన్నై: చైనా దేశానికి చెందిన ఓ యువకుడు నకిలీ టికెట్ తో చెన్నై ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అతన్ని ఎయిర్ పోర్టు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 19 ఏళ్ల యువకుడు హాంకాంగ్ కు చెందిన తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరకెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అయితే సీఐఎస్ ఎఫ్ అధికారులు అతన్ని తనిఖీలు చేస్తుండగా..తాను ట్రిప్ ను రద్దు చేసుకున్నానని ఆ యువకుడు ఆందోళనగా చెప్పాడు. అధికారులు తనిఖీలు చేసి జేబులో ఉన్నది నకిలీ టికెట్ అని నిర్దారించారు. యువకుడిని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. యువకుడు చెన్నైలోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తాడని చెప్పిన పోలీసులు మిగితా వివరాలు మాత్రం వెల్లడించలేదు.

2625
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles