Telangana Intermediate 1st & 2nd Year Results 2019

ఢిల్లీ ఘోరం.. లేఖ‌లో ఇలా రాసి ఉంది..

Mon,July 2, 2018 01:41 PM

Chilling details in Bhatia familys death case

న్యూఢిల్లీ: ఢిల్లీలో 11 మంది మోక్షం కోసం ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు కూడా ఇదే కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బురారీ ఏరియాలోని భాటియా ఫ్యామిలీ ఇంట్లో దొరికిన ఓ లేఖను పోలీసులు విశ్లేషిస్తున్నారు. మంత్ర, తంత్ర పూజల్లో ఆ కుటుంబీకులు పాల్గొన్నారా లేదా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయే ముందు చేతులు, కాళ్లు ఎలా కట్టుకోవాలన్న అంశాన్ని కూడా లేఖలో రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ లేఖను మరింతగా విశ్లేషిస్తున్నామని పోలీస్ కమీషనర్ అలోక్ కుమార్ తెలిపారు.

చేతితో రాసిన లేఖలో ఉన్న కొన్ని అంశాలు ఇవి..
1. చావు కోసం గురువారం లేదా ఆదివారాన్ని ఎంపిక చేసుకోవాలని రాశారు..
2. కండ్లను బట్టతో కట్టుకోవాలని, ఏమాత్రం కనిపించవద్దు. తాడుతో పాటు చీర, దుపట్టాను కూడా వాడాలి..
3. చావు కంటే ఏడు రోజుల ముందు పూజలు చేయాలి. చాలా కఠినంగా వాటిని నిర్వహించాలి. ఒకవేళ ఆ సమయంలో ఆత్మ ప్రవేశిస్తే.. మరుసటి రోజే పనిని పూర్తి చేయాలి.
4. ఒకవేళ వయసు మీరిన వాళ్లు నిలబడలేని పక్షంలో, పక్క రూమ్‌లో వాళ్లను నిద్రపోయేలా చూడాలి.
5. చాలా మసక మసక వెలుతురులో పని పూర్తి చేయాలి..
6. చేతులు కట్టుకున్న తర్వాత.. ఒకవేళ ఏదైనా బట్ట మిగిలినట్లు అనిపిస్తే, దానితో కండ్లు మూయాలి.
7. నోటిని కట్టేందుకు వాడిన బట్టను గట్టిగా కట్టాలి.
8. ఎవరు ఎంత కఠోర దీక్షతో ఈ పని చేస్తారో.. వాళ్లకు ఉత్తమ ఫలితాలు అందుతాయి..
9.రాత్రి 12 నుంచి ఒకటి మధ్య ఈ తంతు నిర్వహించాలి. హవనం-పూజను అంతకముందే చేయాలి.
10. అందరిలోనూ ఒకేరకమైన ఆలోచనలు ఉండాలి. ఒకవేళ మీరు ఇలా చేస్తే..అది మీకు ఉపయుక్తంగా ఉంటుంది.

ఇంకా లేఖలో రాసి ఉన్న అనేక అంశాలను విపులీకరించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. లేఖను డీకోడ్ చేసిన తర్వాత మరికొన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి.

6484
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles