తల్లిదండ్రుల దేశభక్తి.. కుమారుడి పేరు 'మిరాజ్‌'

Wed,February 27, 2019 06:57 PM

Child born during IAF air strike in Pakistan named Mirage Singh by parents

జైపూర్‌ : రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన ఇద్దరు దంపతులు తమకున్న దేశభక్తిని చాటుకున్నారు. ఫిబ్రవరి 26(మంగళవారం)న తెల్లవారుజామున పుట్టిన పండంటి మగబిడ్డకు ఆ దంపతులు భారత యుద్ధ విమానమైన మిరాజ్‌ అనే పేరును నామకరణం చేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే ఉగ్రవాద శిబిరాలపై మొత్తం 12 మిరాజ్‌-2000 యుద్ధ విమానాలు మంగళవారం తెల్లవారుజామున 3:50 గంటల సమయంలో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే మహావీర్‌ సింగ్‌, సోనం సింగ్‌ దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. దీంతో మిరాజ్‌ యుద్ధ విమానాల దాడి నేపథ్యంలో తమ బిడ్డకు మిరాజ్‌ రాథోడ్‌ సింగ్‌ అని నామకరణం చేశామని ఆ దంపతులు తెలిపారు.

ఈ సందర్భంగా పసిబిడ్డ తండ్రి ఎస్‌ఎస్‌ రాథోడ్‌ మాట్లాడుతూ.. జైషే ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం మిరాజ్‌ యుద్ధ విమానం దాడి గుర్తుండిపోయేలా తమ బిడ్డకు మిరాజ్‌ రాథోడ్‌ సింగ్‌ అని పేరు పెట్టామని వెల్లడించాడు. తన బిడ్డ పెరిగి పెద్ద అయిన తర్వాత ఆర్మీలో చేరుతాడనే విశ్వాసం ఉందన్నారాయన. అయితే ఈ కుటుంబం నుంచి భూపేంద్ర సింగ్‌ అనే వ్యక్తి నైనిటాల్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో పని చేస్తున్నాడు.

2865
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles