దేశీయ ఫైట‌ర్ జెట్‌ తేజ‌స్‌లో విహ‌రించిన ఆర్మీ చీఫ్‌

Thu,February 21, 2019 12:43 PM

Chief of the Army Staff General Bipin Rawat flys in indigenous Light Combat Aircraft Tejas at Bangalore

బెంగుళూరు: లైట్ కంబ్యాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజ‌స్‌.. వైమానిక ద‌ళంలోకి వ‌చ్చేసింది. ఎల్‌సీఏ తేజ‌స్ ఫైట‌ర్ జెట్‌ను దేశీయంగా నిర్మించారు. ఈ యుద్ధ విమానాన్ని ఇక వైమానిక ద‌ళం త‌న విధుల్లో వినియోగించ‌నున్న‌ది. బెంగుళూరులో జ‌రుగుతున్న ఎయిర్‌షోలో తేజ‌స్‌ను ప్ర‌ద‌ర్శించారు. ఇవాళ ఆర్మీ చీఫ్ బిపిన్ రావ‌త్‌.. యుద్ధ విమానం తేజ‌స్‌లో విహ‌రించారు. కోపైల‌ట్‌గా ఆయ‌న ఆ విమానంలో పైకి ఎగిరారు. భార‌తీయ వైమానిక ద‌ళానికి ఈ విమానాన్ని సెమిలాక్ సంస్థ ఇటీవ‌లే అప్ప‌గించింది. పూర్తి స్థాయిలో ఆప‌రేష‌న‌ల్ క్లియ‌రెన్స్ వ‌చ్చేసింది. ఆప‌రేష‌న‌ల్ క్లియ‌రెన్స్ ద‌క్క‌డం ఓ మైలురాయి అని ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ బీరేంద‌ర్ సింగ్ ధ‌నోవా తెలిపారు. తాజాగా పోక్రాన్‌లో జ‌రిగిన వాయుశ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న‌లో తేజ‌స్‌ను ప్ర‌ద‌ర్శించారు. ఎయిర్ టు గ్రౌండ్‌, ఎయిర్ టు ఎయిర్ రిఫ్యుయ‌లింగ్ విన్యాసాల‌ను తేజ‌స్ విజ‌య‌వంతంగా నిర్వ‌హించింద‌ని ఎయిర్ చీఫ్ తెలిపారు.

770
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles