యూపీ అధికారులతో భేటీ కానున్న సీజేఐ

Fri,November 8, 2019 11:17 AM

న్యూఢిల్లీ : అయోధ్య తీర్పు రానున్న దృష్ట్యా భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గోగోయ్‌ ఇవాళ మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఉన్నతాధికారులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. యూపీలో శాంతి భద్రతల అంశంపై ఆ రాష్ట్ర సీఎస్‌ రాజేంద్ర కుమార్‌ తివారీ, పోలీసు చీఫ్‌ ఓం ప్రకాశ్‌ సింగ్‌తో పాటు పలువురితో సీజేఐ చర్చించనున్నట్లు సమాచారం. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మ భూమి - బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పును వచ్చే వారం వెల్లడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యూపీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రంజన్‌ గోగోయ్‌ ఈ నెల 17న పదవీవిరమణ పొందనున్నారు. దీంతో 17వ తేదీలోపే అయోధ్యపై తీర్పు రానుంది. ఇక యూపీలో 4 వేల మంది కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నవంబర్‌ 18 వరకు కేంద్ర బలగాలు యూపీలోనే మకాం వేయనున్నాయి.

847
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles