9 మంది మంత్రులుగా ప్రమాణం

Tue,December 25, 2018 01:16 PM

Chhattisgarh Governor Anandiben Patel administered oath to new state cabinet ministers in Raipur

రాయ్ పూర్ : ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్ తన మంత్రి వర్గంలోకి కొత్తగా 9 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రులంతా హిందీలోనే ప్రమాణస్వీకారం చేశారు. రాయ్ పూర్ లోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం భూపేశ్ బఘెల్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ నెల 17న ఛత్తీస్ గఢ్ సీఎంగా భూపేశ్ బఘెల్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. బఘెల్ తో పాటు నాడు ఇద్దరు ఎమ్మెల్యేలు సింగ్ దేవ్, తామ్రధ్వజ్ సాహు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో భూపేశ్ బఘెల్ కేబినెట్ 12 మందికి చేరింది. ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన వారిలో మహ్మద్ అక్బర్, రవీంద్ర చౌబే, జైసింగ్ అగర్వాల్, ఉమేశ్ పటేల్, అనిలా బేడియా, కవాసీ లక్మా, ప్రేం సాయి సింగ్ తెక్కం, శివ కుమార్ దహారియా, రుద్ర గురు ఉన్నారు.5435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles