ఉద్యోగం కావాలంటే నగ్న చిత్రాలు పంపండి..

Sun,August 25, 2019 12:59 PM

Chennai Techie Made Women Send Nude Pics For five Star Hotel Job

హైదరాబాద్: ఫైవ్ స్టార్ హోటల్‌లో ఫ్రంట్ ఆఫీస్ జాబ్ పేరుతో మహిళలను మోసగిస్తున్న చెన్నైకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగరానికి చెందిన బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రదీప్ అనే వ్యక్తి చెన్నైలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉద్యోగం అంటూ మహిళలను సంప్రదిస్తుంటాడు. పరిచయాల అనంతరం మొదటగా సహజంగా ఉన్న వారి ఫోటోలను పంపమంటాడు. వారు ఇతడిని నమ్మిన అనంతరం మీ శరీరాకృతి తెలుసుకునేందుకు నగ్న చిత్రాలు పంపాల్సిందిగా హోటల్ అడుగుతుందని చెబుతూ వారి నుంచి నగ్న చిత్రాలు సేకరించేవాడు. ఇలా అతడి మొబైల్ ఫోన్‌లో 60 మంది మహిళల నగ్న చిత్రాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జూడిషియల్ కస్టడీకి తరలించారు. ఇంకా ఎంత మంది మహిళలు ఇతడి మాయలో పడ్డారో విచారణలో తెలుస్తుందని మియాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్. వేంకటేశ్ వెల్లడించారు.

2428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles