టెకీని కిడ్నాప్‌ చేసి 45 వేలు దోచుకెళ్లారు

Mon,February 4, 2019 04:05 PM

chennai techie kidnap in Bengaluru

బెంగళూరు : చెన్నై ఇన్ఫోసిస్‌కు చెందిన ఉద్యోగిని కిడ్నాప్‌ చేసి రూ. 45 వేలు దోచుకెళ్లిన సంఘటన బెంగళూరులోని హోసూరు ప్రధాన రహదారిలో జనవరి 31వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. చెన్నైకి చెందిన అనురాగ్‌ శర్మ(25) ఆఫీసు పని నిమిత్తం జనవరి 31న బెంగళూరుకు వచ్చాడు. పని ముగించుకున్న శర్మ.. ఆ రోజు రాత్రి చెన్నైకి బయల్దేరేందుకు రాత్రి పన్నెండు గంటల సమయంలో హోసూరు ప్రధాన రహదారిపైకి వచ్చి నిలబడ్డాడు. అంతలోపే తను ఎక్కాల్సిన బస్సు వెళ్లిపోయింది.

ఇక మారుతి ఓమ్నిలో వచ్చిన నలుగురు వ్యక్తులు.. శర్మను కారులోకి లాగారు. కళ్లకు బట్టలు కట్టి.. చేతులు, కాళ్లు కట్టేశారు. ఆ తర్వాత ఎనిమిది గంటల పాటు అనురాగ్‌ శర్మను వేధించి, బెదిరించి ఏటీఎం, క్రెడిట్ కార్డులను లాక్కున్నారు. పిన్ నంబర్లను బలవంతంగా చెప్పించుకొని రూ. 45 వేలను డ్రా చేశారు. తిరిగి ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 8:30 గంటలకు చందాపుర వద్ద అనురాగ్‌ను వదిలేశారు. మొత్తానికి అనురాగ్‌.. సమీపంలో ఉన్న నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నారు. తనను దోపిడీ చేసిన వ్యక్తులపై పోలీసులకు అనురాగ్‌ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు సభ్యుల ముఠా కోసం గాలిస్తున్నారు. అనురాగ్ చెన్నైకి బదిలీ అయ్యే కంటే ముందు మైసూరులోని ఇన్సోసిస్‌లో పని చేసేవాడు. ప్రస్తుతం ఇన్పోసిస్‌లో అనురాగ్‌ సీనియర్ సిస్టమ్స్ మేనేజర్‌గా పని చేస్తున్నారు.


1672
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles