వీళ్లు చాలా మంచి దొంగలు.. ఎందుకో తెలుసా?

Mon,October 15, 2018 03:58 PM

Chennai Pickpockets dropping wallets in post boxes after taking money

చెన్నై: మన వాలెట్ లేదా పర్స్‌ను ఎవరైనా కొట్టేస్తే ఏమనుకుంటాం.. పర్స్ పోతే పోయింది కనీసం అందులోని విలువైన కార్డులు దొరికినా బాగుంటుంది అనుకుంటాం. గతంలో కొంత మంది దొంగలు ఇలా పర్స్‌లు కొట్టేసిన తర్వాత అందులోని డబ్బులు తీసుకొని వాటిని ఎక్కడెక్కడో పాడేసేవాళ్లు. కానీ చెన్నైలో ఈ మధ్య కొత్త ట్రెండ్ కనిపిస్తున్నది. ఇలా పర్స్‌లు కొట్టేసిన దొంగలు అందులో డబ్బులన్నీ తీసుకున్న తర్వాత వాటిని తీసుకెళ్లి పోస్ట్ డబ్బాల్లో వేసేస్తున్నారు. చాలా మంది తమ వాలెట్‌లలోనే ముఖ్యమైన డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, పాన్, ఇతర క్రెడిట్, డెబిట్ కార్డులు పెట్టుకుంటారు. ఈ కార్డులు ఎలాగూ తమకు పనికి రావని భావిస్తున్న దొంగలు.. డబ్బులు మాత్రమే తీసుకొని వాటిని పోస్ట్ బాక్సుల్లో వేస్తున్నారు. ఎలాగూ పోస్టల్ సిబ్బంది ఆ కార్డుల ఆధారంగా వాటిని యజమానులకు చేరుస్తారన్నది వాళ్ల ఉద్దేశంగా కనిపిస్తున్నది.

గత ఆరు నెలలలోనే చెన్నై కార్పొరేషన్ పరిధిలో ఇలాంటి కేసులు 70 వరకు నమోదు కావడం విశేషం. దీనిని బట్టి పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్లకు పరిస్థితి అర్థమైపోయింది. ఎవరో వాలెట్స్ దొంగిలించి.. అందులోని డబ్బులు తీసుకొని వాటిని తమ బాక్సుల్లో వేస్తున్నారని పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్లు చెబుతున్నారు. ఇందులోని ఐడీ కార్డులను బట్టి స్థానిక పోస్ట్ మాస్టర్లు వాటిని యజమానులకు చేరవేస్తున్నారు. వీటి వల్ల పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు వచ్చే అదనపు ఆదాయం ఏమీ లేకపోయినా.. ఓ సేవలాగా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఎవరివైనా ఫోన్ నంబర్లు అందులో దొరికితే వాళ్లకు ఫోన్ చేసి పోస్ట్ ఆఫీస్‌లకు వచ్చి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. మొత్తానికి డబ్బు పోతే పోయినా.. ఇలా విలువైన కార్డులు మాత్రం వెనక్కి రావడంతో బాధితులూ ఖుష్ అవుతున్నారు.

5689
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles