కోర్టులోనే భార్య‌ను క‌త్తితో పొడిచిన భ‌ర్త‌

Tue,March 19, 2019 02:55 PM

Chennai man stabs wife on Madras High Court premises

హైద‌రాబాద్: మ‌ద్రాసు హై కోర్టులో.. ఓ వ్య‌క్తి త‌న భార్యను క‌త్తితో పొడిచాడు. ఈ ఘ‌ట‌న ఫ్యామిలీ కోర్టు ఆవ‌ర‌ణ‌లో ఇవాళ జ‌రిగింది. వ‌ర‌ల‌క్ష్మీ అనే మ‌హిళ‌ను శ‌ర‌వ‌ణ‌ణ్ అనే వ్య‌క్తి క‌త్తితో దాడి చేశాడు. చెన్నైకి చెందిన ఈ ఇద్ద‌రూ దంప‌తులు. కొన్నాళ్ల నుంచి వీరి మ‌ధ్య స‌మ‌స్య‌లు ఉన్నాయి. దీంతో ఫ్యామిలీ కోర్టును ఆశ్ర‌యించారు. అయితే మ‌ద్రాసు హైకోర్టులోని ఫ‌స్ట్ ఫ్లోర్‌లో ఉన్న ఫ్యామిలీ కోర్టుకు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అక్క‌డ ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. స‌డెన్‌గా ఆవేశానికి లోనైన‌ శ‌ర‌వ‌ణ‌ణ్ త‌న భార్య వ‌ర‌ల‌క్ష్మిని క‌త్తితో పొడిచాడు. అక్క‌డున్న లాయ‌ర్లు, ఇత‌రులు అత‌న్ని ప‌ట్టుకుని కోర్టు పోలీసుల‌కు అప్ప‌గించారు. క‌త్తి పోట్ల దాడికి గురైన మ‌హిళ‌ను రాజీవ్ గాంధీ హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.

3995
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles