50 లక్షల మందిని చంపగలిగే కెమికల్ పట్టివేత

Sun,September 30, 2018 03:23 PM

Chemical that can over 50 lakh people Seized From Indore Illegal Laboratory

ఇండోర్: 9 కిలోలకుపైగా సింథ‌టిక్‌ ఒపియాడ్, ఫెంటానిల్ రసాయనాలను ఓ అక్రమ లేబొరేటరీ నుంచి స్వాధీనం చేసుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు. ఈ రసాయనానికి సుమారు 40 లక్షల నుంచి 50 లక్షల మందిని చంపగలిగే శక్తి ఉంటుందని సైంటిస్టులు వెల్లడించారు. రసాయన యుద్ధాల్లో వీటిని వాడుతారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వారం పాటు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ సైంటిస్టులతో కలిసి డీఆర్‌ఐ అధికారులు ఈ కెమికల్‌ను పట్టుకున్నారు. ఈ అక్రమ లేబొరేటరీని ఓ పీహెచ్‌డీ స్కాలర్, స్థానిక వ్యాపారవేత్త కూడా అయిన వ్యక్తి నడిపిస్తున్నాడు.

ఓ మెక్సికో జాతీయుడితోపాటు ఈ లేబొరేటరీ యజమానిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఫెంటానిల్ అనే డ్రగ్ చాలా ప్రమాదకరం. కేవలం రెండు మిల్లీగ్రాముల ఈ డ్రగ్ ఓ వ్యక్తిని చంపగలదు. ఇండియాలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఇది చూసి సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద స్థాయిలో ఈ రసాయనాన్ని తయారు చేయడానికి చాలా నైపుణ్యం కావాలని, కేవలం శిక్షణ పొందిన సైంటిస్టులే ఈ పని చేయగలరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అనస్తీసియా, నొప్పి నివారణ కోసం ప్రస్తుతం ఇలాంటి మందులను ఇండియాలో వాడుతున్నారు.

3077
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles