సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయిన చెఫ్ సంజీవ్ కపూర్!

Fri,April 20, 2018 07:29 PM

Chef Sanjeev Kapoor trolled for his version of Malabar Paneer recipe

చెఫ్ సంజీవ్ కపూర్ తెలుసు కదా? తన కొత్త కొత్త వంటలతో భోజన ప్రియులకు రుచి చూపిస్తుంటాడు. ఇలాగే కొత్తగా ఓ డిష్ ట్రై చేసి బుక్కయిపోయాడు. మలబార్ పన్నీర్ అనే ఓ కొత్త వంటకాన్ని వండి ఆ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీంతో నెటిజన్లు సంజీవ్‌ను ఓ ఆట ఆడుకున్నారు. అసలు కేరళ వాసులకు పన్నీర్ అంటేనే పడదని.. అటువంటిది మలబార్ పన్నీర్ అంటూ ఓ కొత్త వంటకాన్ని వండుతావా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కేర‌ళీయులు మ‌ల‌బార్ వంట‌కాల‌ను చికెన్‌, మట‌న్ లేదంటే ఫిష్‌తో వండుతారు కాని ప‌న్నీర్‌తో కాదు అంటూ కామెంట్లు చేస్తూ సంజీవ్‌ను ట్రోల్ చేస్తున్నారు.

మలబార్ పన్నీర్ వంట‌కం త‌యారీ విధానం ఇదేన‌ట‌...
ఇక‌... ఆయ‌న‌ను ఎలా ట్రోల్ చేశారో చూడండి...7002
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles