పన్ను ఎగవేతలకు చెక్!

Sun,February 24, 2019 08:05 AM

Check for tax avoidance!

న్యూఢిల్లీ: ఎగుమతులకు ఊతమివ్వడానికి, పన్ను ఎగవేతలకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల, కస్టమ్స్ బోర్డు(సీబీఐసీ) ప్రత్యేకంగా మూడు గ్రూపులను ఏర్పాటు చేసింది. పన్నులకు ఎగనామం పెడుతున్న ఈ-కామర్స్ సంస్థల ఆగడాలకు చెక్ పెట్టడానికి, నెలనెల దిగువముఖం పడుతున్న ఎగుమతులను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ గ్రూపులు నిశితంగా పరిశీలించి సీబీఐసీకి తుది నివేదికను సమర్పించనున్నాయి. కస్టమ్స్ ఆదాయ వసూళ్లను పెంచడంలో భాగంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంతోపాటు లొసుగులకు చెక్ పెట్టడం, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ(ఐజీఎస్టీ) రీఫండ్ మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సీబీఐసీ వెల్లడించింది. కస్టమ్స్ టారిఫ్‌ల విషయంలో నిర్మాణాత్మక సంస్కరణలకు పెద్దపీట వేయనున్నట్లు ప్రకటించింది. వాటాదారులు, ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ సభ్యులను సంప్రదించి వచ్చే రెండు నెలల్లో తుది నివేదికను సమర్పించనున్నాయి. ఈ గ్రూపులో సభ్యుల సంఖ్య, ఇతర వివరాలను మాత్రం సీబీఐసీ వెల్లడించలేదు. కానీ, సీబీఐసీ చైర్మన్ ప్రణబ్ కుమార్ దాస్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

906
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles