సాఫీగా.. చంద్ర‌యాన్ మ‌రింత ముందుకు

Mon,July 29, 2019 04:38 PM

Chandrayaan2 is 3 steps closer to the moon, tweets ISRO

హైద‌రాబాద్‌: చంద్రయాన్-2 వాహకనౌక భూ కక్ష్యను మూడ‌వ‌సారి పెంచారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 3.12 నిమిషాల‌కు మూడ‌వ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా చేప‌ట్టారు. సుమారు 989 నిమిషాల పాటు ఈ ప్ర‌క్రియ కొన‌సాగింది. ఆ త‌ర్వాత చంద్ర‌యాన్‌-2 వాహ‌క‌నౌక 276 x 71792 కిలోమీట‌ర్ల ఎత్తుకు చేరుకున్న‌ది. దీంతో చంద్రుడికి చంద్ర‌యాన్ మ‌రింత చేరువైంది. చంద్ర‌యాన్ వ్యోమ‌నౌక అన్ని ప్యారామీట‌ర్ల‌తో స‌హ‌జంగా వెళ్తున్న‌ట్లు ఇస్రో వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆగ‌స్టు 2వ తేదీన వ్యోమ‌నౌక‌కు చెందిన నాలుగ‌వ భూక‌క్ష్య పెంపు ప్రక్రియ‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఆ రోజున మ‌ధ్యాహ్నం 2 నుంచి 3 గంట‌ల మ‌ధ్య ఈ ప్ర‌క్రియ ఉంటుంద‌ని ఇస్రో చెప్పింది. గ‌త శుక్ర‌వారం వేకువజామున విజయవంతంగా రెండో ప్రక్రియను పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. ఆగస్టు 14 వరకు మిగిలిన‌ కక్ష్యలను పెంచే ప్రక్రియను చేపడతామని ఇస్రో వెల్లడించింది.1510
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles