ఏప్రిల్‌లో చంద్రయాన్-2 !

Fri,January 11, 2019 06:32 PM

Chandrayaan 2 project to be executed in Mid April

బెంగుళూరు: చంద్రయాన్-2 మిషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ కే.శివన్ తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుందని గతంలో ఇస్రో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టును మరో నెల రోజులు పొడగించినట్లు తెలుస్తోంది. చంద్రయాన్-2 కోసం సుమారు 800 కోట్లు ఖర్చు చేస్తున్నారు. చంద్రయాన్-1 మిషన్‌కు అడ్వాన్స్‌డ్ వర్షెన్‌గా చంద్రయాన్-2ను డిజైన్ చేశారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ మధ్య వరకు ఎప్పుడైనా చంద్రయాన్-2 ప్రయోగం ఉంటుందని శివన్ తెలిపారు. ఫిబ్రవరి టార్గెట్ మిస్సైందంటే, అప్పుడు ఏప్రిల్‌లోనే ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంటుందని ఇస్రో చైర్మన్ వెల్లడించారు.

1581
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles