సెప్టెంబ‌ర్ 7న‌.. చంద్ర‌యాన్ 2 ల్యాండింగ్ !

Mon,July 22, 2019 12:27 PM

Chandrayaan-2 may land on moon on September 7

హైద‌రాబాద్‌: మ‌రికొన్ని గంట‌ల్లో చంద్ర‌యాన్-2 నింగికి ఎగ‌ర‌నున్న‌ది. జీఎస్ఎల్వీ మార్క్‌-3 రాకెట్ ద్వారా చంద్ర‌యాన్ ప్ర‌యోగం జ‌ర‌గ‌నున్న‌ది. చంద్రయాన్ 2లో ఉన్న ల్యాండ‌ర్ విక్ర‌మ్‌, రోవ‌ర్ ప్ర‌జ్ఞ‌.. ఇస్రో శాస్త్ర‌వేత్తల అంచ‌నాల ప్ర‌కారం ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 7వ తేదీన చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగ‌నున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ క‌న్నా ఒక రోజు ఆల‌స్యంగా ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నున్న‌ది. వాస్త‌వానికి జూలై 15వ తేదీన ఎగ‌రాల్సిన చంద్ర‌యాన్‌2.. సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌యోగం వారం రోజుల ఆల‌స్యం అయినా.. ల్యాండింగ్‌లో మాత్రం ఒక రోజు తేడా వ‌స్తున్న‌ది. పాత ప్లాన్ ప్ర‌కారం.. 54 రోజుల జ‌ర్నీ త‌ర్వాత చంద్ర‌యాన్‌2 .. చంద్రుడిపై దిగాల్సి ఉంది. కానీ అనుకున్న తేదీ ఆల‌స్యం కావ‌డంతో.. ఇస్రో ఇంజినీర్లు కొత్త ప్లాన్ వేశారు. అత్యంత ఖ‌రీదైన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స‌మ‌యం కోల్పోవ‌డంతో.. ఇస్రో ఇంజినీర్లు కోల్పోయిన స‌మయాన్ని తిరిగి పొందేందుకు చంద్ర‌యాన్ మిష‌న్‌లో కొన్ని మార్ప‌లు చేశారు. ఇవాళ మ‌ధ్యాహ్నం 2.43 నిమిషాల‌కు షార్ కేంద్రం నుంచి చంద్ర‌యాన్2 ఎగ‌ర‌నున్న‌ది. పాత ప్లాన్ ప్ర‌కారం ప్ర‌యోగం జ‌రిగిన 22వ రోజు.. చంద్ర‌యాన్ చంద్రుడి క‌క్ష్య‌లోకి వెళ్లేది. కానీ ఇప్పుడు ప్లాన్ మార‌డంతో.. చంద్రుడి క‌క్ష్య‌లోకి చంద్ర‌యాన్ వెళ్లేందుకు 30 రోజులు ప‌ట్ట‌నున్న‌ది. ప్ర‌యోగం జ‌రిగిన 43వ రోజున ల్యాండ‌ర్‌, ఆర్బిట‌ర్‌ను వేరు చేసే ప్ర‌క్రియ జ‌రుగుతుంది. 44వ రోజున డిబూస్టింగ్ చేప‌ట్ట‌నున్నారు. ఇక 48వ రోజున ల్యాండ‌ర్‌, రోవ‌ర్ .. వేరుప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. చంద్రుడి ఉప‌రిత‌లంపై ఉన్న మాంజిన‌ల్ సీ, సింపేలియ‌న్ ఎన్ ప్రాంతంలో ల్యాండ‌ర్ దిగే ఛాన్సుంది.1206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles