చంద్ర‌బాబు, నారా లోకేశ్‌ గృహ నిర్బంధం

Wed,September 11, 2019 09:25 AM

Chandrababu Naidu and his son Nara Lokesh under house arrest in Andhra Pradesh

హైద‌రాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కుమారుడు నారా లోకేశ్‌ల‌ను అమ‌రావ‌తిలో గృహ‌నిర్బంధం చేశారు. అధికార పార్టీకి చెందిన నేత‌ల త‌మ‌పై దాడుల‌కు దిగుతున్నార‌ని టీడీపీ ఆరోపిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఇవాళ బాబు పార్టీ నిర‌స‌నకు పిలుపునిచ్చింది. న‌ర్సారావుపేట‌, స‌త్త‌న‌ప‌ల్లి, ప‌ల్నాడు, గుజ‌రాలాలో 144వ సెక్ష‌న్ విధించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 12 గంట‌ల పాటు ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్టాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ఎటువంటి నిర‌స‌న‌ల‌కు అనుమ‌తి లేద‌ని రాష్ట్ర డీజీపీ గౌత‌మ్ సావంగ్ తెలిపారు. ఛ‌లో ఆత్మ‌కూర్ ఆందోళ‌న చేప‌డుతున్న టీడీపీ నేత‌ల‌కు ఎటువంటి ప‌ర్మిష‌న్ లేద‌న్నారు. టీడీపీ క్యాడ‌ర్‌పై వైసీపీ నేత‌లు చేస్తున్న దాడుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తామ‌ని బాబు అన్నారు. బాధితుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు ఆందోళ‌న విర‌మించేదిలేద‌ని టీడీపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నారా లోకేశ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. మొన్నటివరకూ తన ఇంటిదగ్గర 144 సెక్షన్ అమలు చేశారు, నిన్నటి నుంచి పల్నాడులో.. ఈరోజు ప్రతి తెదేపా నాయకుని ఇంటిముందు అమలు చేస్తున్నారు. ఇది తుగ్లక్ పాలనకు పరాకాష్టకు అని లోకేశ్‌ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.665
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles