మాజీ ప్ర‌ధాని దేవ‌గౌడ‌ను క‌లిసిన చంద్ర‌బాబు

Thu,November 8, 2018 05:37 PM

Chandrababu meets former Prime Minister Deve Gowda

బెంగుళూరు : ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఇవాళ మాజీ ప్ర‌ధాని దేవ గౌడ‌ను క‌లిశారు. మోదీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ముందుకు వెళ్లేందుకు ఆ ఇద్ద‌రూ నిర్ణ‌యించారు. రాజ్యాంగ‌బ‌ద్దంగా ఏర్పాటు అయిన అనేక సంస్థ‌ల‌ను మోదీ ప్ర‌భుత్వం నిర్వీర్యం చేస్తున్న‌ద‌ని, ఎన్డీఏ కూట‌మిని గ‌ద్దె దించాలంటే కాంగ్రెస్ నేతృత్వంలో సెక్యుల‌ర్ పార్టీల‌న్నీ ఏకం కావాల‌ని దేవ గౌడ అన్నారు. ఎన్డీఏ కూట‌మిని త‌ప్పించేందుకు చంద్రాబాబు ఇటీవ‌ల విప‌క్ష పార్టీల నేత‌ల‌ను క‌లుస్తున్నారు. ఈ మ‌ధ్య‌నే ఆయ‌న రాహుల్ గాంధీని క‌లిశారు. అయితే ఆ వ్యూహాన్ని మ‌రింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఇవాళ దేవ‌గౌడ‌తో పాటు క‌ర్నాట‌క సీఎం కుమార‌స్వామిని బాబు క‌లవాల్సి వ‌చ్చింది. ప్ర‌ధాని అభ్య‌ర్థి గురించి తాము ఇప్పుడేమీ ఆలోచించ‌డం లేద‌ని, ముందు దేశాన్ని కాపాడాల‌ని భావిస్తున్న‌ట్లు చంద్ర‌బాబు అన్నారు.

1511
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS