తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు 1200 కోట్లు ఫండింగ్

Tue,December 4, 2018 11:24 AM

హైదరాబాద్: వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు 1200 కోట్ల ఫండింగ్ చేస్తున్నట్టు ఆరోపించారు. ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ మధ్య డీల్ కుదిరిందన్న ఆయన.. రేవంత్‌రెడ్డిని ముందుగా కాంగ్రెస్‌లోకి పంపించడానికి పెద్ద ప్లాన్ జరిగిందన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కూడా చంద్రబాబు భారీగా ఫండింగ్ చేశాడని ఆరోపించారు.


ఏపీలో 4 లక్షల కోట్లు దోచుకున్న చంద్రబాబు దేశంలోని వివిధ రాష్ర్టాలకు ఫండింగ్ చేస్తున్నట్టు విజయసాయిరెడ్డి అన్నారు. 15 వేల కోట్లు కేవలం ఏపీ ఎన్నికల్లో ఖర్చు చేయడం కోసం సిద్ధంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. దోపిడీ సొమ్ము ఏ వాహనంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లబోతుందో కూడా తనకు తెలుసని.. యరపతినేని సుబ్బారావు, శ్రీనివాసరావు, గోపి ద్వారా ఎన్నికలకు డబ్బు వెళ్లబోతున్నట్టు ఆయన ఆరోపించారు. తన దగ్గర చంద్రబాబు అవినీతికి సంబంధించిన పూర్తి సమాచారం ఉందని.. మీడియాకు త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు.

4113
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles